విరాట్,రోహిత్ లకు ఆసీస్ టూరే అఖరిదా…?

 విరాట్,రోహిత్ లకు ఆసీస్ టూరే అఖరిదా…?

virat kohli & Rohith Sharma

టీమిండియా జట్టుకు ప్రస్తుతం వారిద్దరూ మెయిన్ ఫిల్లర్లు.. ఒకరు ఓపెనర్ గా రాణిస్తే.. మరోకరూ మిడిలార్డర్ లో తనదైన శైలీలో పరుగుల సునామీని సృష్టిస్తారు.. ఓపెనర్ గా రోహిత్ శర్మ వచ్చిండంటేనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే కన్పిస్తాయనే నానుడి ఉంది. కానీ ఎందుకో గత కొంతకాలం నుండి రోహిత్ శర్మ నుండి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కన్పించడం లేదు. మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ దిగిండంటే మిగతా బ్యాట్స్ మెన్ హాయిగా డ్రెస్సింగ్ రూంలో తువాలేసుకుని కూర్చోవచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలాలేదు. ఈ ఏడాది జరిగిన టెస్ట్ మ్యాచుల్లో వారిద్దరి ప్రదర్శనను చూస్తే వారు టెస్ట్ మ్యాచుల నుండి తప్పుకోవచ్చు అని వారి అభిమానులే గగ్గోలు పెడుతున్నారు.

టీ20 లకు గుడ్ బై చెప్పినప్పుడు విరాట్,రోహిత్ ల ఫ్యాన్స్ చేసిన హంగామా అంత ఇంతా కాదు. వద్దు టీ20ల్లో వాళ్ళుండాలని ఆన్ ఫీల్డ్.. ఆఫ్ ఫీల్డ్ లో వారు తమ నిరసనగళాన్ని విన్పించారు. వారికి అప్పట్లో అంత నమ్మకం వారిద్దరిపై.. తాజాగా అదే అభిమానులు మీనుండి క్రికెట్ చాలు.. టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకోవాలనే వాళ్లే కోరుతున్నారంటేనే వీరి ప్రదర్శన ఏ స్థాయికి దిగజారిందో చూడోచ్చు. కివీస్ తో జరిగిన మూడు టెస్ట్ ల మ్యాచులో రోహిత్ శర్మ కేవలం 91పరుగులు మాత్రమే చేశాడు. సగటు 15.17మాత్రమే.. మరోవైపు విరాట్ కోహ్లీ 15.50సగటుతో 93పరుగులు చేశాడు.ఒకప్పుడు సచిన్ రికార్డులన్నీ బ్రేక్ చేసే వీరుడు.. శూరుడు విరాట్ కోహ్లీ అన్నవాళ్ళే సచిన్ ఆడిన ఆటలో సగమైన ఆడలేకపోతున్నాడే అని విమర్శిస్తున్నారు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ ఆడటంలో సచిన్ విరాట్ వీరిద్దరి శైలీ వేరు.

స్పిన్ ఆడాలంటే విరాట్ తర్వాతనే అని అందరూ అనుకునేవాళ్లు.. కివీస్ జట్టుతో జరిగిన ఈ సిరీస్ లో నాలుగు సార్లు స్పిన్ బౌలింగ్ లో అవుటవ్వడం మునుపటి సత్తా కోహ్లీలో లోపించిందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇక రోహిత్ శర్మ అయితే అప్పుడే టెస్ట్ క్రికెట్ లో ఎంట్రీచ్చిన ఆటగాడిలా పదే పదే అదే బలహీనతను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో ఆరు టెస్ట్ మ్యాచులాడిన కోహ్లీ చేసిన పరుగులు 250. రోహిత్ శర్మ పదకొండు టెస్ట్ మ్యాచులాడి చేసిన పరుగులు 588. వీరిద్దరి కంటే కొత్తగా ఎంట్రీచ్చిన యువబ్యాటర్లు జైస్వాల్ (1119), శుభ్ మన్ గిల్ (806)నయమన్పించారు . ఒక్క సిరీస్ లో ఫెయిల్ అయినంతమాత్రానో.. ఒక్క ఏడాది విఫలమైనంతమాత్రానో వారిద్దరిని తక్కువ చేయడం కాదు.

ఎలాంటి అనుభవం లేని పంత్,శుభ్ మన్ గిల్, జైస్వాల్ ఆడిన చోట ఎంతో అనుభవం ఉన్న దిగ్గజ ఆటగాళ్లైన కోహ్లీ రోహిత్ విఫలమవ్వడమే ప్రతి భారతీయుడ్ని కలవరపెట్టే అంశం. త్వరలో ఆసీస్ తో జరిగే బీజీటీ లో రాణించకపోతే టెస్ట్ క్రికెట్ లో కొనసాగాలా ..?. వద్దా ..? అని కోహ్లీ రోహిత్ శర్మ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడాలి మరి పడి లేచిన కెరాటం లెక్క వీరిద్దరూ ఆసీస్ తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో అయిన గాయపడిన సింహాం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయాంకరంగా ఉన్నట్లు విజృంభిస్తారేమో..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *