ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ వస్తుందా…?

 ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ వస్తుందా…?

BRS MLC KAVITHA

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు బెయిల్ వస్తుందా..?. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి దాదాపు ఆరు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ రావడం ఖాయమా..?. ఇదే కేసులో ప్రధాన ముద్దయిగా ఆరోపణలు ఎదురుకుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి.. ఆప్ నేత మనీష్ సిసోడియా కు బెయిల్ రావడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందా..?. ఒక్కసారి చూద్దాం…?

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కు సుప్రీం కోర్టు ఐదు కారణాలతో బెయిల్ ఇచ్చిన సంగతి తెల్సిందే.. అందులో భాగంగా ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతో సిసోడియాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేయడం మనం గమనిస్తూనే ఉన్నాము.. ఏదైనా కేసు విచారణ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు పెట్టాలి. లేదా కేసు విచారణలో పురోగతిని అయిన చూపించాలి. కానీ సిసోడియాను అరెస్ట్ చేసి దాదాపు పదిహేడు నెలలుగా విచారణ పేరుతో జైల్లో ఉంచడం వ్యక్తి యొక్క హక్కులను కాలరాయడమే అని సుప్రీమ్ కోర్టు వ్యాఖ్యనించింది..

అంతే కాకుండా స్పీడ్ ట్రైల్ లేని కారణం కూడా మనీష్ సిసోడియా కు బెయిల్ రావడం కారణమైంది. బెయిల్ ఈజ్ రూల్ జైలు ఈజ్ ఎగ్జంప్సన్ అనే నియమం కూడా బెయిల్ రావడానికి దోహదపడింది.. ఒక పరిమితి అంటూ లేకుండా ఒక వ్యక్తిని జైలు లో ఉంచడం కూడా హక్కుల ఉల్లాంఘన కింద వస్తుంది అని కోర్టు వ్యాఖ్యనించింది. మనీష్ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూడా బెయిల్ ఇవ్వచ్చు అని ఇలా ఐదు కారణాలను చూపుతూ మనీష్ కు బెయిల్ మంజూరు చేసింది సుప్రీమ్ కోర్టు..

మరోవైపు ఈ నెల ఎనిమీదో తారీఖున కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ వారంలో ఆ పిటిషన్ విచారణకు రానున్నది.. మనీష్ సిసోడియా కి వర్తించిన నియామలే కవితకు వర్తిస్తాయని న్యాయనిపుణులు వ్యాఖ్యనిస్తున్నారు.. కవితను అరెస్ట్ చేసి ఆరు నెలలు దాటింది.. కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడం.. కేసు కు సంబంధించి కవితపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడం.. కవిత కు ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు రానున్నది . లిక్కర్‌ పాలసీ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవితకు బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు.. ఈరోజు విచారణలో బెయిల్ రావొచ్చు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.. రూల్ ప్రకారం చూసిన మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన తీరును బట్టి చూస్తే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం ఖాయంగానే కన్పిస్తుంది..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *