దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి..?
విజయదశమి రోజు అందరూ పాలపిట్టను చూడాలని అంటారు. అయితే విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే అదృష్టం.. విజయం వరిస్తుందని మెజార్టీ ప్రజల నమ్మకం.రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికెళ్లే సమయంలో పాలపిట్టను చూశాడు.
యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించాడాని పురాణాల్లో చెప్పుకునే గాథ. మరోవైపు పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు కూడా పాలపిట్టను వాళ్లు చూశారు.
అందుకే కౌరవులతో జరిగిన భీకర యుద్ధంలో గెలుపొందారని నమ్మకం. ఈ నమ్మకంతోనే గ్రామాల్లో పల్లెల్లో దసరా రోజు సాయంత్రం ప్రజలు పాలపిట్టను చూసేందుకు పొలాలు,ఊరి చివరకు వెళ్తారని నానుడి.