గూడెం అవేమి మాటలయ్యా…!

గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. మహిపాల్ పార్టీలో చేరిన దగ్గర నుండి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ రెడ్డి ఇతనికి వర్గపోరు నడుస్తుంది.
ఈ అంశం గురించి ఏఐసీసీ నుండి టీపీసీసీ వరకూ అందరూ నేతలు పిలిచి మరి వీరిద్దరి మధ్యలో సయోధ్య కుదిరిచ్చే ప్రయత్నం కూడా చేశారు. తాజాగా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ విషయంలో బాధితులు ఎమ్మెల్యే మహిపాల్ ను కలిశారు.
మీరు అధికార పార్టీలో చేరారు కాబట్టి ఇన్నాళ్ళు మీదగ్గరకు రాలేదు. మా సమస్యను చెప్పుకోలేదని బాధితులు తెలిపారు. దీనికి సమాధానమిస్తూ అధికార పార్టీ లో నేను లేను. కాంగ్రెస్ పార్టీ అదోక లౌ. ల పార్టీ ..నేను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ అని వారితో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఏంది బ్రో అంత మాట అనేశావు. గూడెం అవేమి మాటలయ్యా.. ఎంతైన అది అధికార పార్టీ.. కొద్దిగా గౌరవమియ్యవయ్యా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
