మేం ఉద్యమకారులం..!

తెలంగాణలో మేం ఉద్యమకారులం.తెలంగాణ రాష్ట్ర సాధనకై కొట్లాడినం..ఎన్నో సార్లు జైళ్లకెళ్లినం అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు.. టీవీ9 న్యూస్ ఛానెల్ తో మాట్లాడితూ పదవులను అడుక్కోవడానికి మేము ఏమి బిచ్చగాళ్లం కాదు.
ఉద్యమకారిణిగా నాకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ నన్ను ఆహ్వానించింది.కానీ ఆ రెండు పార్టీల మధ్యలో ఓ లోపాయికారి ఒప్పందం జరిగింది.
అది తెల్సి నేనుఅందుకే బీజేపీ నుంచి బయటకు వచ్చాను..ఓ బీసీ మహిళా నేతగా నన్ను గుర్తించారు. నన్నుకేబినెట్‌లో తీసుకోవడంపై అధిష్ఠానం నిర్ణయిస్తుంది అని విజయశాంతి అన్నారు.
