బరువు తగ్గాలనుకుంటున్నారా..?
ఈరోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లతో… జీవిన శైలీతో మన శరీర బరువులనేది మన చేతుల్లో లేకుండా పోయింది. వయసుకు తగ్గ బరువు కంటే అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలతో పాటు పలు ఇబ్బందులను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కుంటున్నాము. అయితే మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..?. అయితే ఇది మీకోసమే..!
వేగంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు కొన్ని అలవాట్లను పాటిస్తే తగ్గుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పరగడపున గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. యోగా ,ఏరోబిక్ ,సైక్లింగ్,మార్నింగ్ లేచి నడవడం లాంటివి తప్పనిసరిగా చేయాలి. వీటి వల్ల మన శరీర బరువు తగ్గడమే కాకుండా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.
జంక్ పుడ్ తినడం మానేయాలి. కాఫీలు, టీలు మితంగా తీసుకోవాలి. రాత్రి ఏడు గంటల్లోపు భోజనం ముగించాలి.. ఒకపూట తప్పనిసరిగా ఉడికించిన కూరగాయలనే తినాలి. నారింజ,ద్రాక్ష ,అరటి,బొప్పాయి పండ్లు తీసుకోవాలి. వారానికి 0.5 కిలోల బరువు తగ్గడం సురక్షితం అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆహారపు అలవాట్లు.. జీవన శైలీపైనే సగం మన శరీర బరువు తగ్గడం పెరగడం ఉంటుందని అంటున్నారు.