తన ఆరోగ్యం గురించి విశాల్ క్లారిటీ..!
ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో వణుకుతూ కన్పించిన విశాల్ ఆరోగ్యంపై మీడియాలో సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై ప్రముఖ నటీ ఖుష్బూ సైతం క్లారిటీచ్చారు.
తాజాగా తన ఆరోగ్యం గురించి హీరో విశాల్ క్లారిటీచ్చారు. మదగజరాజు ప్రీమియర్ షో సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ ” తాను చాలా ఆరోగ్యంగానే ఉన్నాను. ప్రస్తుతానికి ఎలాంటి సమస్యల్లేవు అని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ” మా నాన్న ఇచ్చిన ధైర్యం వల్లనే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చిన తట్టుకుని నిలబడుతున్నాను.
నేను పని నుంచి తప్పించుకుంటాను. మూడు నుండి ఆరు నెలలకోకసారి సినిమాల నుండి విశ్రాంతి తీసుకుంటానని కొందరూ అంటున్నారు. ఇప్పుడు నాచేతులు వణకడం లేదు. అంతా బాగానే ఉందని తెలిపారు.