త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న స్టార్ హీరో..!

సింగిడిన్యూస్, చెన్నై: తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విశాల్ ఎట్టలకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నిన్న మొన్నటి వరకూ విశాల్ పెళ్లి గురించి పలు రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజా వార్తతో ఆవార్తలన్నింటీకి చెక్ పెట్టినట్లు అయింది.
తమిళ ఇందస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ సాయి ధన్సిక ను విశాల్ పెళ్లి చేసుకుంటారనే కన్ఫార్మ్ అయింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్, సాయి ధన్సిక ఈ అంశం గురించి మాట్లాడుతూ ‘ తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. ఆగస్టు29న అందరి సమక్షంలో ఒకటి కాబోతున్నాము అని పెళ్లి ముహూర్తాన్ని సైతం ఫిక్స్ చేశారు.
హీరో విశాల్ మాట్లాడుతూ ‘ ధన్సిక చాలా మంచి వ్యక్తి.. మేం కలిసి మేమిద్దరం చాలా మంచి జీవితాన్ని ప్రారంభించ బోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తుంది’ అని అన్నారు. హీరోయిన్ ధన్సిక మాట్లాడుతూ ‘కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం మొదలైంది. అది ప్రేమగా మారింది. విశాల్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
