ఆధిక్యంలో వినేశ్ ఫొగట్

vinesh phogat
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన భారత మాజీ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
ఆమె రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లా నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారు.
ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటిన కాంగ్రెస్ పార్టీ యాబై స్థానాల్లో ముందంజలో ఉంది.
