కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడిన గ్రామస్తులు..!

Villagers revolt against Congress MLA..!
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ప్రారంభించడానికి ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆకేరు వాగు నుండి ఇసుకను తరలించుకుంటూ జీవిస్తున్న ఐదు వేల మంది కుటుంబాలకు చెందిన ఇసుక కూలీలు.. ట్రాక్టర్ల డ్రైవర్లు ఎమ్మెల్యే నాగరాజును అడ్డుకున్నారు. స్థానిక అధికారులు.. పోలీసులు తమను ఇసుకను రవాణా చేసుకోకుండా అడ్డుకుంటూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఎన్ని సార్లు విన్నవించుకున్న మా విన్నపాన్ని సమస్యను పరిష్కరించడం లేదు.
గత ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నాము. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మా కడుపులపై కొడతారా.. మా జీవనోపాధిని లేకుండా చేస్తారా అంటూ ఎమ్మెల్యేను అడ్డుకుంటూ తీవ్ర ఆందోళన చేశారు. పోలీసులు.. అధికారులు ఎంత నచ్చచెప్పిన కానీ వారు వినలేదు. దీంతో తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నాగరాజు అక్కడ నుండి వెళ్ళిపోయారు.
