విజయవాడకు రెండు వైపులా ముప్పు

 విజయవాడకు రెండు వైపులా ముప్పు

Vijayawada Floods

బెజవాడకు రెండువైపుల నుంచి ముంపు పొంచి ఉన్నది. ఓవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు కాలువ పొంగిపొర్లుతుంది. ఇంకోవైపు గత యాబై ఏండ్ల ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్‌ఫ్లో. 11 లక్షల క్యూసెక్కులు దాటి వరద వస్తుంది.

12 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణం తర్వాత ఈస్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

మరోవైపు బుడమేరు దెబ్బకు విజయవాడ శివారు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 కాలనీలు, పలు గ్రామాలను వరద ముంచెత్తింది.. ఇప్పటికే తొమ్మిది మంది మృతిచెందారు.. కొన్ని వందల మంది నిరాశ్రయులయ్యారు.మరోవైపు మరో వాయనాడ్ గా విజయవాడ వరదలను విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *