త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక..!

Vice President election coming soon..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ థన్కర్ తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతోనే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీంతో త్వరలోనే తదుపరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ మొదలు కానున్నది.
కొత్తగా ఎన్నికయ్యేవారు పూర్తిగా ఐదేండ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. రూల్స్ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికాలం పూర్తయితే అరవై రోజుల్లో కొత్తవారిని ఎన్నికోవాల్సి ఉంటుంది. దీనికి కనీసం ఇరవై మంది ఎంపీలు ప్రతిపాదించిన వారే పోటీకి అర్హులు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్న బలబలాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎన్డీఏ, ఇండి కూటముల మధ్యే పోటీ ఉంటుంది.