కొత్త గోదాముల నిర్మాణం చేపట్టండి

 కొత్త గోదాముల నిర్మాణం చేపట్టండి

1 total views , 1 views today

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మార్క్ ఫెడ్ అధికారులు, HACA అధికారులతో వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస రెడ్డిగారు ప్రస్తుతం రాష్ట్రంలో 83075 మెట్రిక్ టన్నుల సోయాబీన్ ను 42 కేంద్రాల ద్వారా 48133 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని, 990 మెట్రిక్ టన్నలు పెసళ్లను 14 కేంద్రాల ద్వారా 1607 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందని తెలిపారు. అలాగే ప్రస్తుతం NAFED మరియు NCCF కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రాష్ట్రములో కందుల కొనుగోలు చేపట్టడం జరుగుతున్నదని వివరించారు.

మార్కుఫెడ్ ద్వారా 903 ప్రాధమిక సహకార సంఘాలు 416 ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలు 55 HACA సేవాకేంద్రాల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా నిరంతరంగా జరుగుతుందని తెలియజేసారు.
దీనికి మంత్రిగారు స్పందిస్తు, ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళికబద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను అదేశించారు. డిమాండుకు అనుగుణంగా ఎరువుల నిల్వలు ఉన్నాయని, పంపిణీలో జాగ్రత్త వహించాలన్నారు.

మార్క్ ఫెడ్ వారు వివిధ జిల్లాలలో 76 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించి, ప్రస్తుతం 21 కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, కావునా రైతులు ప్రభుత్వం అందిస్తున్న మద్ధతు ధర రూ. 7550 కి తమ కందిపంటను అమ్ముకోవాలని కోరారు. మార్క్ ఫెడ్ ద్వారా 79,000 మెట్రిక్ టన్నుల సామార్థ్యంతో గోదాముల నిర్మాణము జరిగిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అలాగే అవసరమైన చోట గోదాములపై సౌరవిద్యుత్ ఉత్పత్తి ఏర్పాటుకై తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం ఎరువుల సరఫరా మరియు అన్ని రకాల పంటల కొనుగోళ్లు కొరకై అవసరమైన అన్ని చర్యలు ముందస్తుగానే తీసుకోవాల్సింది గా ఆదేశించినారు.

సంస్థ, రైతుల సంక్షేమం కోసం చేపట్టే పనులకు ప్రభుత్వం మద్ధతు అందిస్తున్నది అని తెలియజేశారు. రైతాంగ వృద్ధికి పాటుపడే FPDలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలియజేశారు.HACA MD శ్రీ చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ సంవత్సరం సంస్థ తరఫున చేపట్టిన కార్యక్రమాలు వివరించగా, తమ కార్యకలాపాల పరిధిని పెంచాలని, వ్యవసాయశాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు సంస్థ తరఫున తోడ్పాటు దించాల్సిందిగా మంత్రిగారు ఆదేశించారు. అవసరమైతే కొత్తగా సిబ్బందిని తీసుకొని, రైతాంగం సంక్షేమంలో భాగస్వాములు కావాలని సూచించారు.


రెండు ప్రభుత్వరంగ సంస్థలు వాటి నిరర్ధక ఆస్తులను వినియోగంలోకి తెచ్చేవిధంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ఆదేశించారు. సంస్థల వృద్ధితో పాటు రైతాంగ సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరి రఘునందన్ రావు , వ్యవసాయశాఖ సంచాలకులు గోపి గారు, HACA MD చంద్రశేఖర్ రెడ్డి గారు, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస రెడ్డి తో పాటు సంస్థల అధికారులు పాల్గొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400