వల్లభనేని వంశీ కేసులో ట్విస్ట్..!

vallabhaneni vamshi.jpg
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా మరో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ఆదేశాలను రద్దు చేయాలని ఏ7, ఏ8 తరుపు లాయర్ చిరంజీవి మెమో దాఖలు చేశారు.
నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఎక్కడ వారిని విచారిస్తున్నారన్న విషయాన్ని ముందుగానే వారి తరపు న్యాయవాదులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశమిచ్చింది.
ఈ ఆదేశాలు పోలీసులు పాటించలేదని అసలు తమకు సమాచారం ఇవ్వలేదని కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని ఆ మెమోలో క్లియర్ గా పేర్కొన్నారు.
