అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్ట్…?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ ఘటనలో ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే బన్నీ అరెస్ట్ పై బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా స్పందిస్తున్నారు.
ఇటీవల జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మరిచిపోయారు. నీళ్ళు తాగి ఆ తర్వాత ఆయన పేరును ఉచ్చరించారు.
రేవంత్ రెడ్డి పేరును తాను మరిచిపోవడంతోనే ఆయన పగబట్టి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయించారని ముఖ్యమంత్రి & కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నారు.