రేవంత్ కు తుమ్మల లేఖ
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాశారు.. ఈ నెల ఆరు తారీఖున ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో అయన లేఖ రాశారు..
ఆ లేఖలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుంచి ఏపీలో విలీనమైన గ్రామ పంచాయతీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
భద్రాచలం నుండి ఏపీలో కలిపిన గుండాల, పురుషోత్తమపట్నం, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడును తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.