తూచ్.. పదేండ్లు కాదు ఐదేండ్లే..!
![తూచ్.. పదేండ్లు కాదు ఐదేండ్లే..!](https://www.singidi.com/wp-content/uploads/2024/09/komatireddy-venkata-reddy-850x560.jpg)
Komatireddy Venkat Reddy Minister Of Telangana
గతంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే పదేండ్లు నేనే సీఎం కుర్చిలో కూర్చుంటాను.. ఇరవై ఏండ్లు తామే అధికారంలో ఉంటామని వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లు తామే అధికారంలో ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీఎల్పీ భేటీ అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణలో లేదు.
బీజేపీ స్టేట్ మెంట్ లకు తప్పా పని చేయడానికి పనికిరాదని వ్యాఖ్యానించారు.వచ్చే ఐదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ప్రతిపక్షాలకు పని పాట ఏమి లేదు. అందుకే ప్రతీదానికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వందశాతం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)