తెలుగువారికి ఆపత్కాలం… జాడ లేని హీరోయిన్లు
సినిమా అంటే యావత్ ఇండియాలోనే తెలుగు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా పడిచస్తారు(వారి భాషలో). తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఆ రోజు ఎన్ని పనులు ఉన్న. ప్రపంచం అంత తలకిందులైన సరే ఫస్ట్ డే .. బెనిఫిట్ షో నుండి ఆరోజు మొత్తం షో లన్నీ చూస్తారు. తమ అభిమాన హీరోలకు కటౌట్ల దగ్గర నుండి పాలాభిషేకాల వరకు అన్ని పనులు పద్ధతిగా చేస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆ చిత్రం యొక్క ఫస్ట్ డే కలెక్షన్లు పడిపోకుండా వేరే హీరో సినిమా కలెక్షన్ల కంటే తమ హీరో సినిమా కలెక్షన్లు ముందుండేలా చూస్కుంటారు.
అట్లాంటి అభిమానులు అటు ఏపీ ఇటు తెలంగాణలో వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీలో విజయవాడ,తెలంగాణలో ఖమ్మం అంటే సినీ రాజకీయ చైతన్య ఉన్న ప్రాంతాలు. అలాంటి ప్రాంతాలు భీభత్స వరదలతో.. వర్షాలతో ఆస్తి నష్టం కు గురయ్యాయి. దీంతో కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోల దగ్గర నుండి కమెడియన్ల వరకు తమ వంతు సాయం చేస్తున్నారు. కోట్ల నుండి లక్షల వరకు వీలైనంత వరకు వరద బాధితులకు అందజేస్తున్నారు. అఖరికి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువహీరోయిన్.. హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల తనకు చేతనైనంతగా ఐదు లక్షల సాయం ప్రకటించింది.
అంతేకాకుండా వరదలతో ఆపదల్లో ఉన్న బాధితులకు మనవంతు సాయం చేయాలని పిలుపునిచ్చింది. కానీ సినిమా అయితే రెండు కోట్ల నుండి పది కోట్ల వరకు.. ఈవెంట్ అయితే యాబై లక్షల నుండి రెండు కోట్ల వరకు రోజు చార్జ్ చేసే లేడీ అమితాబ్ గా పిలిచే స్టార్ సీనియర్ హీరోయిన్ కావోచ్చు .. నేషనల్ క్రష్ గా పిలుచుకునే హాటేస్ట్ బ్యూటీ కావోచ్చు.. మిల్క్ బ్యూటీ అన్పించుకునే హీరోయిన్ కావోచ్చు. పదికోట్ల నుండి పదిహేను కోట్లు తీసుకునే స్వీటీ కావోచ్చు ఏ టీ అయిన సరే ఆర్థిక సాయం పక్కనెట్టు కనీసం ట్విట్టర్లో మాట సాయం కూడా చేయలేదంటేనే ఆర్ధమవుతుంది .
ఆపదల్లో ఉన్న అభిమానుల పట్ల తమ వైఖరీ ఏంటని విశ్లేషకులు ,సినీ విమర్శకులు విమర్శిస్తున్నారు. ఆపద అంటే సాయం చేయాల్నా అని ప్రశ్నించవచ్చు కానీ తమను ఆరాధ్య దేవతలుగా.. తమకు జీవనోపాధికి కారణమైన వారు ఆపదల్లో ఉంటే సాయం చేయడం మానవత్వం కదా అని వారి అభిప్రాయం. ఇప్పటికైన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు తమ వంతు సాయం చేయడానికి ముందుకోస్తారని ఆశిద్దాం అని వారు విశ్లేషిస్తున్నారు.