డిప్యూటీ సీఎం పై ట్రోలింగ్ – కేసులు నమోదు..!

 డిప్యూటీ సీఎం పై ట్రోలింగ్ – కేసులు నమోదు..!

Trolling on Deputy CM – Cases registered..!

Loading

ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కల్సి మహాకుంభ మేళకు వెళ్లిన సంగతి తెల్సిందే. కుంభమేళలో భాగంగా పవన్ కళ్యాన్ స్నానమాచరించిన ఫోటోలకు కొంతమంది నెటిజన్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టపరంగా కేసులు పెడుతున్నారు జనసైనికులు.

అసలు విషయానికి వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తూ పోస్టులు పెడుతున్న నెటిజన్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.. కుంభమేళాలో పవిత్రస్నానం చేసిన పవన్ ఫొటోలను మార్ఫింగ్‌ చేసినట్లు ఆయా పీఎస్ లకు పిర్యాదులు అందుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి.

రాష్ట్రంలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు .. పవన్ ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పిర్యాదులో జనసేన కార్యకర్తలు పేర్కోన్నారు.. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్‌పై కేసు ఒకటి నమోదైంది.. చిత్తూరులో హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై కేసు నమోదు చేశారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *