రాఖీ రోజు ఏపీలో విషాదం..!

Tragedy in AP on Rakhi Day..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : దేశమంతటా రాఖీ వేడుకలను జరుపుకుంటున్న వేళ ఏపీలో పెనువిషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం లో రెండు బైకులు ఢీకొని శంకర్, సువర్ణరాజు మరణించారు.
సోదరితో రాఖీ కట్టించుకునేందుకు యాదవోలు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో పెద్దేవంకు చెందిన శంకర్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ మరణ వార్త తెలిసి అతని తండ్రి శ్రీను గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. రాఖీ పౌర్ణమి పండుగవేళ తండ్రీకొడుకుల మృతితో పెద్దేవంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.