కొండా సురేఖ వివాదంపై టీపీసీసీ స్పందన
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే..
ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై చేయకూడదు. పార్టీ ఆదేశాల మేరకు సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఇరువైపులా మహిళలే ఉన్నారు. ఇందుకు సినీ ప్రముఖులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన కోరారు.