రేపే TPCC చీఫ్ ప్రకటన
కాంగ్రెస్ జాతీయ అధిష్ఠానం రేపు పీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశముంది. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సామాజిక లెక్కల ఆధారంగా వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారని సమాచారం. కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పదవీకాలం జులై 7న ముగిసింది.
కొత్త చీఫ్ ఎంపికపై ఇప్పటికే ఆయన పలుమార్లు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.