తెలంగాణలో బీర్ల టిన్నుల యూనిట్
మనం తాగే కూల్ డ్రింకులు, బీర్ల పరిశ్రమలకు అవసరమయ్యే అలూమీనియం టిన్నులను తయారు చేసే బాల్ బెవరేజ్ ప్యాకింగ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ.700 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
ఈ మేరకు సెక్రటేరియెట్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ గణేశన్ భేటీ అయ్యారు.
ఈ భేటీ లో పలు అంశాలపై చర్చించారు. యూనిట్ ఏర్పాటు ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారం తదితర వాటి గురించి సుధీర్ఘ సమీక్ష చేశారు.