దిల్ రాజుకి ఆ ఇద్దరే అభిమాన హీరోలు..!
మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాము.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ విక్టరీ వెంకటేశ్ ఫొటో చూడగానే తాను ఫ్యాన్ అయిపోయినట్లు దిల్ రాజు చెప్పారు.
సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. తాను ఊరిలో ఉన్నప్పుడు నాగార్జున, వెంకటేశ్ హీరోలుగా లాంచ్ అయ్యే టైంలో ఎవరికి ఫ్యాన్ అవ్వాలనే చర్చ ఉండేదని ఆయన తెలిపారు. వెంకీ ఫ్యాన్ గా హైదరాబాద్ కు వచ్చిన మొదట్లో కలియుగ పాండవులు సినిమా ఫస్ట్ షో చూశానని చెప్పారు. సినిమా ఫీల్డ్ లోకి వచ్చాక పవన్ కళ్యాణ్కు అభిమానిని అయ్యాయని ఆయన వెల్లడించారు.