విజయవాడ మునకకు కారణం ఇదే..?
ఏపీకి రాజధానిని అమరావతిని చేసి తీరుతాము… దేశానికే ప్రపంచానికి ఆదర్శంగా తీర్చి దిద్దుతాము అని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిన ఎన్నికల ప్రచారం. తీరా నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు అమరావతితో సహా విజయవాడం అంతటా మునిగిపోయింది. ఇండ్లల్లోకి.. కాలనీల్లోకి..హైకోర్టుతో సహా హోం మంత్రి నివాసం ఇలా ఎవరితోనూ భేదాభిప్రాయం లేకుండా అన్నిచోట్ల వరద నీళ్ళు నదులెక్క సముద్రాలెక్క పారాయి.
అయితే విజయవాడ మునగకు అసలు కారణం ఏంటో నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడూ బుడమేరు కాలువ నగరీకరణ కారణంగా మురికి నీరు,చెత్తా చెదారంతో నిండిపోయింది. పైగానగరంలోని అవుట్ ఫాల్ డ్రెయిన్లు సైతం బుడమేరు కాలువలోనే కలుస్తున్నాయి.
ఎన్నడూ లేని భారీ వర్షాలు కురవడం.. కురిసిన భారీ వరద పోవడానికి మార్గం లేకపోవడం.. ఊహించనీ రీతిలో వరద రావడంతో బుడమేరు కాలువ ఉప్పోంగిపోయింది. దీంతో విజయవాడ జలదిగ్భందంలో వెళ్లిపోయింది.. కాలనీలు.. రోడ్లు ఇలా అన్ని జలమయం అయ్యాయి.