జనసేనాని ఆలోచించు కదా…?

 జనసేనాని ఆలోచించు కదా…?

Pawan Kalyan Deputy CM Of Ap

జనసేనాని … ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లయ తప్పుతున్నారా..?. అధికారంలోకి రాకముందు ఎలా వ్యవహరించారో.. అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఉండాల్సినట్లు ఉండటం లేదా..?. పవన్ తీరుతో ఆయన పొలిటికల్ కేరీర్ పై మచ్చ పడుతుందా..?. మొన్న విజయవాడ వరద బాధితుల విషయంలో.. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలో ఒకే తీరుగా వ్యవహరించి నవ్వుల పాలవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు..

ప్రస్తుతం ఏపీతో పాటు జాతీయ రాజకీయాలను షేక్ చేస్తున్న అంశం తిరుపతి లడ్డూ వివాదం.. ఈ వివాదం అఖరికి ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గరకు కూడా చేరింది.. చివరికి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలని పిటిషన్ వేశారు.

తాజాగా హీరో కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సోమవారం జరిగింది.ఈ వేడుకలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ.. లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్ చేశారు. లడ్డూ గురించి హీరో కార్తీ మాట్లాడిన మాటల్లో సెటైర్లు కానీ వ్యంగ్యం కానీ ఏమి లేదు.

కానీ ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏకంగా లడ్డూ గురించి అవాక్కులు చవాక్కులు పేల్చద్దు.. సెటైర్లు వేయద్దు అని సలహా ఇచ్చారు. ఇక్కడ కార్తీ మాట్లాడిన మాటల్లో ఏమి సెటైర్లు ఉన్నాయి. ఏమి వ్యంగ్యం ఉంది. అది ప్రస్తుతం సెన్సిటీవ్ అంశం కాబట్టి ఆ టాఫిక్ వద్దు అని యాంకర్ తో అనడం తప్పా.. పవన్ కు ఎవరూ సలహాలు ఇస్తున్నారో కానీ ఆలోచించి మాట్లాడాలని రాజకీయ విమర్శకులు సలహాలు ఇస్తున్నారు.. మరి పవన్ పాటిస్తాడా..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *