మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ

D. Sridhar Babu Minister of IT of Telangana
తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు అతిరథ మహరధులు హాజరయ్యారు. ఈ క్రమంలో బంజారా హీల్స్ మినిస్టర క్వార్టర్స్ లో మంత్రి దుద్ధిళ్ళ ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజలకు ప్రిన్సిపల్ సెక్రటరీ పీఏ సతీష్ కుమార్ సైతం హజరయ్యారు.
అయితే పూజల అనంతరం ఫోన్ మాయమైనట్లు గమనించి నిన్న శుక్రవారం సతీష్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తాను బిజీగా ఉండటం వల్ల ఆలస్యంగా పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిపాడు.
