సీతారామ  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

 సీతారామ  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

ఈనెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో  రేవంత్ రెడ్డి పాల్గొంటారు. భద్రాద్రి జిల్లా లోని దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ నెల 15న ప్రారంభం కానుండటంతో ఈ నెల 11న మంత్రి సమక్షంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *