ఏకైక ఆటగాడు సౌరవ్ గంగూలీ..!

ఐసీసీ టోర్నీలలో భారత్ ఇప్పటి వరకూ చాలా ఫైనల్స్ ఆడింది. అయితే అందులో సెంచరీ చేసింది మాత్రం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కరే.
సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట 2000లో జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాదా 117 పరుగులు చేశాడు. భారత్ 264 పరుగులు చేసింది.
అయితే మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి కూడా ఛాంపియన్ ట్రోపీ ఫైనల్లో ప్రత్యర్థి న్యూజిలాండే కావడంతో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
