ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనతను ఆర్సీబీ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య తన సొంతం చేసుకున్నారు.
ఐపీఎల్ లో రెండు ఫైనల్స్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందిన తొలి ఆటగాడిగా పాండ్య నిలిచారు. 2017లో ముంబై జట్టు తరపున రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.
తాజాగా పంజాబ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి పదిహేడు పరుగులిచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. అప్పుడు నలబై ఏడు పరుగులతో రాణించగా , ఇప్పుడు బౌలింగ్ తో తన ప్రతాపాన్ని చూపాడు.