పవన్ కళ్యాణ్ సమక్షంలో మంత్రికి ఘోర అవమానం
జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకే చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో గుర్లలో అతిసార వ్యాధితో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. వందల మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వం యొక్క వైపల్యం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది అని ప్రజలు తీవ్ర ఆగ్రహాం తో ఉన్నారు.
అతిసార వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను.. మృత్యువాత పడిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాకు వచ్చారు. ఈ క్రమంలో గుర్ల ఆసుపత్రిలో బాధితులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ రాకతో భద్రతా సిబ్బంది ఆసుపత్రి లోపలకి ఎవర్ని అనుమతించలేదు..
అఖర్కి మంత్రిగా ఉన్న శ్రీనివాస్ ను సైతం అక్కడున్నవాళ్లు అడ్డుకున్నారు. దీంతో మంత్రి తీవ్ర అసహానానికి లోనయ్యారు. ఆయన అనుచరులు మాత్రం అవమాన భారంతో ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వంలో మంత్రులకిచ్చే మర్యాద ఇదేనా.. సీఎం తర్వాత సీఎం ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి పర్యటనకు వచ్చినప్పుడు మంత్రులకు కూడా విలువ ఉండదా అని వాళ్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.