గాయని ఇంట తీవ్ర విషాదం

 గాయని ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌  ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమె భర్త జానీ చాకో ఉతుప్ నిన్న సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని వారి నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. టీవీ చూస్తున్న సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

కానీ, అప్పటికే ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉషా ఉతుప్‌కు కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. తండ్రి మరణంపై అంజలి తన సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘నాన్నా.. మమ్మల్ని అందరినీ వదిలేసి చాలా త్వరగా వెళ్లిపోయావు. నువ్వు ఎంతో స్టైలిష్‌గా జీవించావు. ప్రపంచంలో అత్యంత అందమైన మనిషివి. మేము నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం’ అని  పోస్ట్‌లో పేర్కొన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *