యువతకు కేంద్రం శుభవార్త..!
లోక్‌సభలో కేంద్రమంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గిగ్‌వర్కర్లకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు.
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.దేశవ్యాప్తంగా అనేక డెలివరీ సంస్థల్లో ఎన్నో వేల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా గిగ్ వర్కర్లు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వ ప్రకటనతో గిగ్‌వర్కర్లకు ఈ బీమా ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు