తెలంగాణలో పడకేసిన ప్రభుత్వ వైద్యం – కాగ్
తెలంగాణ రాష్ట్రంలో వైద్యాశాఖ పడకేసిందని తెలిపింది కాగ్. తెలంగాణ రాష్ట్రంలోని వైద్యాశాఖపై కాగ్ ఓ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తుంది.. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్ర వైద్యా శాఖాలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి..
దాదాపు నలబై ఐదు శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రజలకు సరిపడా వైద్య సదుపాయలు అందడంలేదు.. ఆస్పత్రుల్లో సరైన వసతులతో పాటు బెడ్ల సంఖ్య కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రజనాభాకు అనుగుణమ్గా మొత్తం 35,004పడకలు అవసరం ఉండగా 27,996 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. వైద్యా కళాశాల్లో సిబ్బంది తీవ్ర కొరత ఉన్నట్లు ఆ నివేదికలో తెలిపింది.