ఆకేరు వాగు ఎండింది – అన్నదాత కడుపు మాడింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనలోసాగునీరు లేక, బోర్లు పడక, ఎస్సారెస్పీ నీళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతుల సమస్యలు తెలుసుకుని వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు..
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రావూరు గ్రామంలోని ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి, సాగునీరు రాక, చేతికి వచ్చిన పంట ఎండిపోతుంది.చేసేదేమీ లేక “మాకు చావే శరణ్యం” అని నీటి కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు రైతులు..
ఈ విషయం తెలుసుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రావూరు గ్రామానికి చెందిన రైతులను పరామర్శించడానికి స్వయాన గ్రామానికి వెళ్లారు..
వారిని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు. వారి సమస్య తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడారు..సాగునీరు లేక ఎండుతున్న పంటలకోసం నీళ్లు వచ్చేలా చూడాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.