తండేల్ మూవీ రివ్యూ..!
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా.. సాయిపల్లవి హీరోయిన్ గా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మ్యూజిక్ చార్టులలో టాప్ ప్లేస్‌లో, అలాగే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. మరి ఈ సినిమాని చూసిన ట్విట్టర్ ప్రేక్షకులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుస్కుందామా!..
మొత్తం రూ. 70 కోట్ల భారీ బడ్జెట్ తో హీరో నాగ చైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కింది. చైతూకు ఇది సోలోగా ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్. ఉత్తరాది అభిమానులను కూడా ఆకర్షించేందుకు ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన ఎలిమెంట్స్ కు స్థానం కల్పించారు. మరి దర్శకుడు చందూ మొండేటి మరో విక్టరీ సాదించాడా? నాగ చైతన్య పర్ఫామెన్స్ ఎలా ఉంది? సాయి పల్లవి మరోసారి మ్యాజిక్ చేసిందా? డీఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది? అల్లు అరవింద్ సేఫెనా? అంటే.. ఇప్పటి వరకు ఈ సినిమాని ఓవర్సీస్, ప్రీమియర్స్‌లో చూసిన సినీ అభిమానులు ఏమంటున్నారు అంటే..
ఒకరు.. ‘ లవ్ స్టోరీ ఓకే చూడొచ్చు. నాగ చైతన్య, సాయి పల్లవి పర్ఫామెన్స్ సినిమాని నిలబెట్టాయి. డీఎస్పీ లవ్ స్టోరీస్ కు ఇచ్చే మ్యూజిక్ మాములుగా ఉండదు. రీసెంట్ ఇయర్స్ లో డీఎస్పీ బెస్ట్ మ్యూజిక్ ఇది, ఆర్ఆర్, బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకి బలంగా నిలిచాయి. కానీ.. స్లో నేరేషన్, పాకిస్థాన్ ఎపిసోడ్స్ సినిమాకు మైనస్ గా మారాయి . టోటల్ గా ఈ సినిమాని చూసేయొచ్చు’ అంటున్నారు.
మరికొందరు రాస్తూ.. ‘నటీ నటులు, మ్యూజిక్ డైరెక్టర్ అదరగొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఓకే. సెకాండాఫ్ సాలిడ్‌గా ఉంది. కానీ రైటింగ్ మాత్రం చాలా వీక్ గా ఉందంటున్నారు. కార్తికేయ 2 లాంటి సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ ఈ సినిమాని తీశాడా అనే డౌట్ వస్తుంది’ అని రాసుకొచ్చారు.