రాజకీయాల్లోకి తెలుగు నటుడు ఎంట్రీ…?

India Loss The Match
రాజకీయాల్లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. విలన్ షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు.
ఇందులో భాగంగా ఆయన ముంబైలో అజిత్ పవార్ సమక్షంలో ఎన్సీపీ పార్టీలో ఆయన చేరారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు నటుడు షాయాజీ షిండే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి .. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి మనకు తెల్సిందే.
షిండే ఠాగూర్, గుడుంబా శంకర్, ఆంధ్రుడు, పోకిరీ, అతడు, సూపర్ ,చిరుత , నేనింతే, ఆర్య 2 , కిక్, అరుంధతి, ఊసరవెల్లి, దూకుడు,శక్తి ,ఇస్మార్ట్ శంకర్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.
