తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా స్కూళ్లల్లో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది.
అయితే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనున్నట్లు తెలుస్తుంది..