నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్ శుభవార్త.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిరుద్యోగ యువతకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్తను తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన చెప్పారు. .
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇంకా పదిహేడు వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను సిద్ధం చేసింది. వచ్చే మార్చిలోపు మొత్తం లక్ష ఉద్యోగాలను ఇవ్వాలని ఈరోజు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై, వారికివ్వాల్సిన పెండింగ్ బిల్స్, పీఆర్సీ, డీఏల గురించి ఆఫీసర్స్ కమిటీ వేసి స్ట్రీమ్ లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.