తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది

 తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది

Deputy CM Pawan Kalyan’s visit to Kurnool

Loading

తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. హోలీరోజున జయకేతనం ఎగరవేయడం ఆ దేవుడి దీవెన. దేశ ఐక్యతకు బహుభాషలు కావాలి. 2003లో నేను రాజకీయాల్లోకి వెళ్తానని మా అమ్మకు చెప్పాను అని జనసేన అధినేత… డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు.

చిత్రాడలో జరిగిన జనసేన పదోకోండో వార్శికోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను నటించిన ఖుషీ సినిమా నుంచి గద్దరన్నతో నాకు స్నేహం ఉంది. మన 11వ సంవత్సరం వాళ్ల 11కు అంకితం చేస్తున్నాను అని ఆయన ప్రకటించాడు. సగటు మనిషిగా ఉండటమే నాకిష్టం అని పవన్ ఉద్ఘాటించారు. సున్నితమైన వ్యక్తి అని నన్ను ఇంట్లో నుంచి కదలనీయకుండా పెంచారు.

నేను సినిమాల్లోకి వస్తానని, రాజకీయాలు చేస్తానని ఎవరు ఊహించలేదు. నాలోని భావతీవ్రత నాతో పార్టీ పెట్టేలా చేసింది.నేను కర్మ చేస్తాను, ఫలితం ఆశించను. భయాలు, బాధ్యతల మధ్య జీవితం సాగించాను. జనసేన కోసం 7 సిద్ధాంతాలు చాలా ఆలోచించి పెట్టినవి. 100 శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించామంటే దానికి జనసేన సిద్ధాంతాలే కారణం. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వాన్ని చూడటమే నా ఐడియాలజీ అని చెప్పారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *