బీసీలకు 42% రిజర్వేషన్లు వద్దంటున్నా మాజీ మంత్రి జానారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రివర్యులు జానారెడ్డి పై ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు..
కులగణనపై సచివాలయంలో జరిగిన సమావేశానికి నన్ను పిలిచారు ఆ సమావేశంలో పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు స్కిప్ చేద్దామని అన్నాడు.. సుప్రీం కోర్టులో బీసీలకు అంత రిజర్వేషన్లు ఇవ్వరు అని అంటున్నాడు.
మేనిఫెస్టోలో పదహారు పేజీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పెట్టింది మనమే కదా.. ఇప్పుడు స్కిప్ చేద్దామంటే బీసీలు ఈ మోసం పసిగట్టరు అని అనుకుంటున్నారా? అని నేను ప్రశ్నించాను అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు..