ఉప్పల్ లో టీమిండియా ఊచకోత

sanju Samson
బంగ్లాదేశ్ జట్టుతో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 అఖరి మూడో మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు బంగ్లా బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
ఓపెనర్లుగా దిగిన సంజూ శాంసన్ 11*4,8*6 సాయంతో 111(47) సాధించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 4(4) పరుగులకే ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సూర్యకుమార్ యాదవ్ బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ ఎనిమిది ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో ముప్పై ఐదు బంతుల్లో డెబ్బై ఐదు పరుగులు చేశాడు.
హార్థిక్ పాండ్యా నాలుగు ఫోర్లు.. నాలుగు సిక్సర్ల సాయంతో పద్దెనిమిది బంతుల్లో 47పరుగులు సాధించాడు. రియాన్ పరాగ్ నాలుగు సిక్సర్లు.. ఒక ఫోర్ సాయంతో పదమూడు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేశాడు.దీంతో పూర్తి ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్లను కోల్పోయి 297పరుగులు చేసింది.
