బాబుకు తలనొప్పిగా మారిన TDP MLA
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అమరావతి రాజధాని అంశంపై అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా కొట్లాడి మంచి పేరు తెచ్చుకోని ఉపాధ్యాయ వృత్తి నుండి ఏకంగా రాజకీయాల్లోకి ఎంట్రీచ్చి తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు కొలికపూడి శ్రీనివాసరావు. గెలిచిన కొద్ది రోజులకే తన అధికార బలాన్ని ఉపయోగించి మరి ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఓ నేతకు సంబంధించిన భవనాన్ని కూల్చివేయించారు.
ఒక్కరు కాదు ఇద్దరూ కాదు వందల మంది పోలీసులను,అధికార సిబ్బందిని తీసుకెళ్లి మరి అధికార యంత్రాంగం వారిస్తున్న వినకుండా ఆ వైసీపీ నేత భవనాన్ని కూల్చేశారు ఎమ్మెల్యే కొలికపూడి. అప్పట్లో ఈ ఇష్యూ మరింత జఠిలం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా సదరు ఎమ్మెల్యేను అమరావతికి పిలుపించుకోని మరి తిట్లు తిట్టడమే కాకుండా వార్నింగ్ ఇచ్చారు .. ఎమ్మెల్యేను దూరం పెట్టినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి..
తాజాగా సదరు ఎమ్మెల్యే తీరు మార్చుకోకుండా డ్వాక్రా గ్రూపు మహిళలను బూతులు తిట్టారు. అక్కడితో ఆగకుండా సదరు మహిళను ఏకంగా ఐదారు గంటలు పోలీసు స్టేషన్ లో ఉంచడం ప్రస్తుతం తిరువూరు తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఒకపక్క ముఖ్యమంత్రితో సహా మంత్రులు.. ఎమ్మెల్యేలు వరదల నుండి ప్రజలను రక్షిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుంటే మరో పక్క ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంతో ఇటు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు. వరదల అనంతరం మరోక్కసారి బాబు పిలిచి ఈసారి తీవ్రంగా హెచ్చరిస్తారనే టాక్ కూడా ఎన్టీఆర్ భవన్ వర్గాలు అంటున్నాయి.