TDP MLA పై సస్సెన్షన్ వేటు

TDP worker’s suicide – a lesson for political parties..!
ఏపీ అధికార టీడీపీకి చెందిన సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపించిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ ” టీడీపీ కార్యకర్తగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదిమూలం తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ఆ సమయంలో నా ఫోన్ నంబరు తీసుకున్నారు..
ఆ తర్వాత పలుమార్లు నాకు కాల్ చేసి నన్ను హోటల్ కు పిలిపించి అత్యాచారం చేశాడు. అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జూలై ఆరో తారీఖున తిరుపతిలోని ఓ రూమ్ కు పిలిచి మరోకసారి నాపై బలాత్కారం చేశారు. మళ్లీ రాకపోతే చంపేస్తానని బెదిరించారు.
ఈ విషయం నా భర్తకు చెబితే ఆయన నాకు పెన్ కెమెరా ఇచ్చి పంపారు. దీంతో గత ఆగస్టు నెల పదో తారీఖున వీడియో రికార్డు చేశాను “అని ప్రెస్మీట్ పెట్టి వివరించారు. దీనిపై స్పందించిన టీడీపీ నాయకత్వం వెంటనే ఎమ్మెల్యే ఆదిమూలం ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ.. ఈ సంఘటనపై వివరణ అడిగారు.
