టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సంచలన నిర్ణయం.!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం ఆళ్లగడ్డలో జరిగిన తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి అఖిల ప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల పాక్ ఆర్మీ కాల్పుల్లో చనిపోయిన ఆగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు నివాళులు అర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ” సైనికులను మనం కాపాడుకోవాలి. వారికి మనం గౌరవం, మర్యాద ఇవ్వాలి. వారికోసం నేను ఐదు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నాను’ అని ప్రకటించారు.