Junior NTR పై TDP నేత సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మనవడు.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ఇంటర్వూలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ” టీడీపీకి ఇంత ఊపు తీసుకొచ్చి ఆధికారం దిశగా నడిపించింది టీడీపీ జాతీయ కార్యదర్శి..మంత్రి నారా లోకేశ్ మాత్రమే ” అని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,నారా భువనేశ్వరి,నారా లోకేశ్ ,బ్రాహ్మాణి,దేవాన్స్ నాయకత్వంలో పని చేస్తాను.
పార్టీ వ్యవస్థాపకుడు .. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో పని చేయారా..? అని జర్నలిస్ట్ బుద్ధా వెంకన్నను ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ ” జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం అసలు ఒప్పుకునేది లేదు. రామారావు మనవళ్లు చాలా మంది ఉన్నారు.. వారిలో ఒకరూ జూనియర్ ఎన్టీఆర్ అని తేల్చి చెప్పారు.