తండేల్ మరో రికార్డు..!

thandel
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా…. నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన మూవీ ‘తండేల్’ . ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది.
చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
