రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు అక్షింతలు
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అక్షింతలు వేసినట్లు తెలుస్తుంది.. ఓటుకు నోటు కేసు మహారాష్ట్రకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణలో సందర్భంలో సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.
గతంలో లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పై విడుదలపై వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానకరంగా మాట్లాడటంపై అప్పట్లో సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడం.. ముఖ్యమంత్రి తన లాయర్ ద్వారా క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది.
తాజాగా సుప్రీం కోర్టు బాధ్యతాయుత పదవుల్లో ఉన్నప్పుడు కోర్టులను గౌరవించాలి.. కోర్టు తీర్పులపై మాట్లాడటం కోర్టు దిక్కారం కింద వస్తుందనే సోయి కూడా లేకుండా మాట్లాడటం కరెక్టు కాదు.. ఏదైన మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి అని సూచించింది.. కోర్టులను అవమానించేలా మాట్లాడితే సహించము అని హెచ్చరించింది.