స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్..!

Srileela dating a star hero..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆ హీరో తల్లి మాలా తివారీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ మాలా తివారీ మాట్లాడుతూ “మంచి డాక్టర్ ను తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. శ్రీలీల మెడిసన్ చేస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వీరిద్దరి డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న శ్రీలీల హీరో కార్తిక్ ఆర్యన్ తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు. సినిమా క్రీడా రంగంలో ఉన్న ప్రముఖులపై ఇలాంటి డేటింగ్ వార్తలు రావడం సాధరణమే అని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో..!
