నీటిపైనే స్పేస్ షటిల్స్ ల్యాండింగ్ ఎందుకంటే..?

Space shuttles land on water because…?
దాదాపు 286రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ ఈరోజు ఉదయం తెల్లారుజామున ఈభూమీద ల్యాండ్ అయ్యారు. అయితే స్పేస్ షటిల్స్ ను నీళ్లపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాము.
అమెరికాకు గల భౌగోళిక వెసులుబాటుతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాకు అట్లాంటిక్, పసిఫిక్ లాంటి మహాసముద్రాలు ఉండటం భౌగోళిక లాభం. నీళ్లపైనే ఎందుకు ల్యాండింగ్ చేస్తారంటే చివరిదశలో వేగం తగ్గించేలా వేరే మెషీన్లు అవసరం లేదు.
పారాచూట్లతో ఒకవేళ ఇవి తెగిన నీటిపై ఎక్కడ ల్యాండ్ అయిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయటకు తీసుకురావడం చాలా సులభం. తరలింపు సైతం ఇంకా సులువు. మరోవైపు క్యాప్సుల్స్ దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. ఈ తరహా పరిస్థితుల వల్లనే నీళ్లపై ల్యాండింగ్ కు మొగ్గు చూపుతారు.
